Webdunia - Bharat's app for daily news and videos

Install App

27 ఏళ్ల మహిళపై అత్యాచారం.. కేసు రాజీకి రాకపోవడంతో చేతివేళ్లు నరికేసిన కామాంధుడు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రెండేళ్ళ క్రితం 27 యేళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా, బాధితురాలితో రాజీ కుదుర్చుకునేందుకు 45 యేళ్ల కామాంధుడు ప్రయత్నించాడు. దీనికి ఆమె జాప

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (12:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. రెండేళ్ళ క్రితం 27 యేళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా, బాధితురాలితో రాజీ కుదుర్చుకునేందుకు 45 యేళ్ల కామాంధుడు ప్రయత్నించాడు. దీనికి ఆమె జాప్యం చేయడంతో చేతి వేళ్లు నరికేశాడు. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్‌ఘడ్‌లోని జరాన్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల కున్వర్ లాల్ రెండేళ్ల క్రితం 27 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడు. 2014 అక్టోబరులో జరిగిన ఈ అత్యాచారం కేసు రెండేళ్లకు కోర్టులో విచారణకు వచ్చింది. ఇన్నాళ్లు జైలులో ఉన్న నిందితుడు కున్వర్ లాల్‌కు గత నెలలో స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన కామాంధుడు కున్వర్ లాల్ తన సహచరులైన మహేంద్రయాదవ్, భగవాన్ యాదవ్ లతో కలిసి అత్యాచార బాధితురాలైన మహిళను కేసులో రాజీపడేలా రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని ఒత్తిడి చేయసాగాడు. కేసులో తనతో రాజీపడకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరిస్తూ వచ్చాడు. 
 
ఆ కామాంధుడితో ఆ బాధితురాలు రాజీకి రాకపోవడంతో ఆగ్రహించిన కామాంధుడు.. ఆ మహిళ రెండు వేళ్లను నరికివేశాడు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసు ఎస్పీ నిమిష్ అగర్వాల్‌ను కలిసి తన చేతివేళ్లు చూపించి కామాంధుడిపై ఫిర్యాదు చేశారు. తాను కేసులో రాజీకి రానందుకే తన చేతివేళ్లు నరికివేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments