Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినులను హిజాబ్ ధరించాలని బలవంతం చేశారా?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (12:41 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను హిజాబ్ ధరించాలని బలవంతం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాల బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన తమ స్కూలు టాపర్లతో కూడిన ఒక ఫ్లెక్సీని విడుదల చేసింది. అందులోని ముస్లింలు కానీ అమ్మాయిలు కూడా స్కార్ప్స్ ధరించి కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూలు యాజమాన్యం ఒత్తిడి చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టర్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ పోస్టర్‌పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రియాంక కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మే 30వ తేదీన తమకు ఎన్.సి.పి.సి.ఆర్. ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల కుటుంబాలను కలిశారని తెలిపారు. అయితే, ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. 
 
మరోవైపు, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ఇప్పటికే మేం ఈ విషయంపై లోతైన విచారణ కోసం దామోహ్ జిల్లా పోలీసు ఎస్పీని ఆదేశించినట్టు మిశ్రా వెల్లడించారు. అలాగే, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ అంశంపై దృష్టిసారించి నివేదిక కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments