Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించింది.. అంతే కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాల

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (18:21 IST)
మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై తొలుత అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే మైనర్ బాలిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించడంతో.. ఆమెను హతమార్చేందుకు పూనుకున్నాడు. 
 
ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటల్లో చిక్కుకోగానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 50 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments