Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో తండ్రి.. వివాహేతర సంబంధంలో తల్లి: పరువు కోసం తల్లినే చంపేసిన కుమారులు!

ఆధునిక ప్రభావంతో విలువలు మట్టికలిసిపోతున్నాయి. ఒకవైపు మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు అక్రమ సంబంధాలతో హత్యలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ తల్లిని కన్న బిడ్

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (17:47 IST)
ఆధునిక ప్రభావంతో విలువలు మట్టికలిసిపోతున్నాయి. ఒకవైపు మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు అక్రమ సంబంధాలతో హత్యలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ తల్లిని కన్న బిడ్డలే హత్య చేశారు. ఈ ఘటన పంజాబ్‌లోని జగ్రావ్ సమీపంలో చక్కర్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే కరమ్‌జిత్‌కౌర్ (40) భర్త బీందర్ సింగ్ ఎనిమిది సంవత్సరాలుగా దుబాయ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరికి 17,19 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. కరమ్‌జిత్‌ తన ఇద్దరు కుమారులతో గ్రామంలోనే ఉంటోంది.
 
అయితే కరమ్‌జిత్ అదే గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుమారులు ఆమెను ఇంటికే పరిమితం చేశారు. కానీ ఈ విషయంపై తల్లీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఎంతచెప్పినా తల్లి పట్టించుకోకపోవడంతో.. తల్లి వైఖరి మారదనుకున్న ఆ కుమారులు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్రిస్తున్న సమయంలో ఆమెపై కొడవలితో దాడిచేసి చంపేసి పరారైనారు.

పరువు కోసమే ఇదంతా చేసినట్లు.. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమైందని పోలీసులు చెప్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం కరమ్‌జిత్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments