Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ లాఠీతో ఆకతాయిల తాట తీసిన యూపీ యువతి.. వీడియో వైరల్

యూపీ అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. కొత్త సీఎంగా ఆదిత్య బాధ్యతలు స్వీకరించాక మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తారనే విషయాన్ని పక్కనబెడితే.. మహిళలపై యూపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అరాచకాలు పెచ్చరిల్లిపోతున్న

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (15:46 IST)
యూపీ అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. కొత్త సీఎంగా ఆదిత్య బాధ్యతలు స్వీకరించాక మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తారనే విషయాన్ని పక్కనబెడితే.. మహిళలపై యూపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే యూపీలో ఆటపట్టించిన ఆకతాయిలకు ఓ యువతి సరిగ్గా బుద్ధి చెప్పింది. ఆకతాయిలు అల్లరి చేస్తున్నా.. పట్టించుకోని పోలీసులకు కూడా తద్వారా కనువిప్పు కలిగింది. 
 
మహిళాలోకానికి ఆదర్శంగా నిలిచేలా ఉత్తరప్రదేశ్‌లోని ఓ యువతి తనను వేధించిన వారిని ఉతికి ఆరేసింది. పోలీసు లాఠీని లాక్కుని మరీ కాళిగా మారిపోయింది. ఆదివారం సాయంత్రం లక్నోలోని గౌతం పాలి పోలీస్ స్టేషన్ సమీపంలో కొందరు యువతులు నడిచి వెళ్తుండగా, బైకుల మీద వచ్చిన ఆకతాయిలు వారిని వేధించడం మొదలు పెట్టారు. పోలీసులు ఉన్నా సరే పట్టించుకోకుండా రెచ్చిపోయారు.
 
దీంతో కోపంతో ఊగిపోయిన ఓ యువతి పోలీసు చేతిలో లాఠీ లాక్కుని ఆకతాయిలను చితకబాదింది. జీవితంలో వాళ్లు మరిచిపోలేని విధంగా చావబాదింది. తోటివాళ్లు సముదాయించడంతో చివరికి శాంతించింది. ఈ సంఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments