Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే వున్నారు.. నెడుమారన్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (14:13 IST)
ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారనే శుభవార్తను తెలియజేస్తున్నానని ఎల్టీటీఈ లీడర్ పళ నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పళనెడుమారన్ మాట్లాడుతూ, తమిళ ఈలం ప్రజల ఆవిర్భావానికి సంబంధించిన ప్రణాళికను త్వరలో ప్రకటిస్తానన్నారు.
 
తమిళ ఈలం ప్రజలు, ప్రపంచ తమిళులు ఏకమై తనకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎల్టీటీఈ బలంగా ఉన్నంత వరకు భారత వ్యతిరేక దేశాలు తమ గడ్డపై అడుగు పెట్టనివ్వలేదని, భారత వ్యతిరేక దేశాలకు ఏ సమయంలోనూ ఎవరి నుంచి సాయం అందదని నెడుమారన్ తేల్చి చెప్పారు.
 
ప్రస్తుతం శ్రీలంకలో చైనా లోతైన స్థావరాన్ని నెలకొల్పేందుకు, భారత్ వ్యతిరేక స్థావరంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని నెడుమారన్ దుయ్యబట్టారు. చైనా పట్టులో ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే తమిళనాడులోని అన్ని పార్టీలు, తమిళ ప్రజలు ప్రభాకరన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments