Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం!

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (10:02 IST)
వాయవ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలు, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలు, హర్యానా, చండీగడ్‌, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, యుపిలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఉపశమించాయి. కానీ మరో రెండు రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఎగువ నుండి కురుస్తోన్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. జూరాల, శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సూర్యారావుపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఆగడం లేదు. దీంతో భారీగా నీటికి కిందికి వదులుతున్నారు. డిండి, మూసీ ప్రాజెక్టుల్లోనూ భారీగా నీరు చేరింది.

భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంటలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నిర్మల్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments