Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కులో పోలీసులకు చిక్కిన ప్రేమ జంట.. రూ.200 ఫైన్ కోసం జీపెక్కించారు..

ప్రేమ జంటలు పార్కులకు వెళ్లడం సాధారణం. అయితే పార్కుల్లో అసాంఘిక చర్యలు జరిగిపోతున్నాయని.. లవర్స్‌ను అరెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కొందరి ప్రేమికులు కాని జంటలు అరెస్టయిన దాఖలున్నాయి. కానీ కొద్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (13:33 IST)
ప్రేమ జంటలు పార్కులకు వెళ్లడం సాధారణం. అయితే పార్కుల్లో అసాంఘిక చర్యలు జరిగిపోతున్నాయని.. లవర్స్‌ను అరెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కొందరి ప్రేమికులు కాని జంటలు అరెస్టయిన దాఖలున్నాయి. కానీ కొద్ది రోజుల్లో వివాహంతో ఒక్కటి కానున్న ఓ జంట మాత్రం పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం తిరువనంతపురంలోని ఓ పబ్లిక్ పార్క్‌కు విష్ణు, ఆర్తి అనే ఓ ప్రేమ జంట వెళ్లింది. వారిద్దరూ ఓ దగ్గరికి వెళ్లి కూర్చోగానే.. ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ వచ్చి వారిద్దరిని బెదిరించారు. 
 
వెంటనే విష్ణు ఫేస్‌బుక్‌లో ఉన్న లైవ్ ఆప్షన్‌ను క్లిక్ చేశాడు. జరిగిన వ్యవహారాన్నంతా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. పోలీస్ స్టేషన్‌కు తాము రామని.. పబ్లిక్‌లో తాము న్యూసెన్స్ క్రియేట్ చేయలేదని.. అసభ్యంగా ప్రవర్తించనూ లేదని క్లారిటీ ఇచ్చినా.. కానిస్టేబుల్స్ వదల్లేదు. న్యూసెన్స్ కింద రెండు వందల ఫైన్ కట్టాలని తెలిపారు. అందుకు ఆ జంట ఒప్పుకోకపోవడతో.. పోలీసులు ఆ జంటను జీపెక్కించారు. 
 
అలాగే ఫైన్ స్లిప్‌పై సంతకం చేసి... పోలీస్ జీప్ ఎక్కారు. జీప్‌లో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని చేయని తప్పుకు కూడా పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని.. ఆర్తి తెలిపింది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments