పెళ్లయిన మహిళను ప్రేమించి ఆమెతో పరార్: పట్టుకుని మూత్రం తాగించి గుండు కొట్టారు

ఐవీఆర్
గురువారం, 21 మార్చి 2024 (16:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. వివాహితను ప్రేమించి ఆమెను తీసుకుని పారిపోయిన యువకుడిని చితకొట్టి, బలవంతంగా మూత్రం తాగించారు. ఆ తర్వాత అతడికి గుండు కొట్టించి మెడలో చెప్పులు దండ వేశారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
 
ఆ వీడియోలో ఓ వ్యక్తి చెప్పుల దండను ధరించి, బాటిల్‌లోని మూత్రం అని భావించే ద్రవాన్ని తాగుతున్నట్లు కనిపించాడు. కొంతమంది అరుస్తూ అతనిపై దాడి చేస్తూ కనిపించారు. మరో వీడియోలో వ్యక్తి తన చేతితో పట్టుకున్న చెప్పుతో కొట్టడం, అతని తలపై చెప్పు పెట్టమని బలవంతం చేయడం కనబడింది. సదరు వ్యక్తి అతడి మీసాలలో సగం, తల జుట్టు భాగాలను కత్తిరించినట్లు కనిపిస్తోంది.
 
దీని గురించి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితీష్ భార్గవ విలేకరులతో మాట్లాడుతూ, మూడు-నాలుగు రోజుల నాటి వీడియో క్లిప్‌లను తాము గుర్తించామని, బాధితుడిని సంప్రదించామని చెప్పారు. "వీడియోలు పోలీసుల దృష్టికి వచ్చిన తరువాత, మేము ముందుగానే బాధితుడి ఇంటికి వెళ్లాము, కానీ అతను అక్కడ లేడు" అని చెప్పాడు.
 
ఈ ఘటన వెనుక గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, బాధితురాలితో మాట్లాడిన తర్వాత నిర్ధారిస్తామని అధికారి తెలిపారు. తాము ముందస్తుగా బాధితుడిని సంప్రదించినప్పటికీ అతడి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అని అతను చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments