Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధాని హత్యే లక్ష్యంగా.. లండన్‌లో ఉగ్రదాడి జరిగిందా?

బ్రిటన్ రాజధాని లండన్‌లో ఓ ఉగ్రవాది దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ పార్లమెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఓ ఆగంతకుడు దాడికి తెగబడ్డాడు. ఆ సమయంలో ప్రధాని థెరిసా మే పార్లమెంట్‌లోనే ఉన్నారు.

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (10:45 IST)
బ్రిటన్ రాజధాని లండన్‌లో ఓ ఉగ్రవాది దాడిలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ పార్లమెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ఓ ఆగంతకుడు దాడికి తెగబడ్డాడు. ఆ సమయంలో ప్రధాని థెరిసా మే పార్లమెంట్‌లోనే ఉన్నారు. ఆమెను హత్య చేసేందుకే ఆ ఉగ్రవాది దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
 
అసలు ఈ దాడి జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తే.. పార్లమెంట్ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్నాయి. బుధవారం.. సమయం మధ్యాహ్నం 2 గంటలు.. నిందితుడు అబూ ఇజాదీన్ కారులో బ్రిటన్‌ పార్లమెంట్ వైపు బయలుదేరాడు.
 
జెట్ స్పీడ్ వేగంతో కారు నడుపుతూ వెస్ట్‌ మినిస్టర్‌ వంతెనపై వెళుతున్న పాదచారులను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. వంతెన రెయిలింగ్‌ను ఢీకొని కారు కూడా ఆగిపోయింది. ఆ వెంటనే అబూ ఇజాదీన్‌ పార్లమెంట్ వైపు పరుగులు తీశాడు.
 
అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. అతడి చేతిలో ఓ కత్తి ఉంది. భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు.. చివరకు ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడి చేశాడు. లొంగిపోవాల్సిందిగా భద్రతా సిబ్బంది హెచ్చరించినా అబూ పట్టించుకోలేదు. చివరకు పోలీసులు అతడిని కాల్చి చంపారు. అబూ చేతిలో గాయపడిన పోలీసు అధికారి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.
 
దాడి జరిగిన సమయంలో బ్రిటన్‌ ప్రధాని పార్లమెంట్‌లో ఉన్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ముగించుకుని ఆమె కారు ఎక్కుతున్న సమయంలో దాడి జరిగింది. దీంతో ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో పార్లమెంట్‌కు వచ్చేదారులను తాత్కాలికంగా మూసి వేశారు. లోపలున్న ఎంపీలెవరినీ బయటికి రానివ్వలేదు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments