Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా.. వయనాడ్ నుంచి మళ్ళీ రాహుల్ పోటీ?

ఠాగూర్
శుక్రవారం, 8 మార్చి 2024 (10:02 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోట చేసే అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేయనుంది. గత రాత్రి కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులను ఖరారు చేసిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ జాబితాను మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం విడుదల చేయనున్నారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. 
 
ఈ అభ్యర్థుల జాబితాపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, 'కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్‌లో అభ్యర్థులను ఖరారు చేశాము. ఈ అంశంలో కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుంది' అని విలేకరులతో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
 
కాంగ్రెస్ పార్టీ వర్గాల ప్రకారం, రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్.. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందాగావ్ నుంచి, జోస్నా మహంత్ కోర్చా నుంచి బరిలోకి దిగుతారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యనేతలందరూ ఈసారి బరిలోకి దిగారు. కేరళలోని 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. సీనియర్ నేత శశిథరూర్ కూడా ఎన్నికల్లో నిలబడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
కర్ణాటకలో రాష్ట్ర మంత్రులెవరూ లోక్‌సభ బరిలోకి దిగరని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనడంపై బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు. బహుశా ఒకే ఒక మంత్రి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు, పార్టీ ఎంపీ డీకే సురేశ్ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిథ్యం వహిస్తున్న కల్‌బుర్గీ స్థానంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 
 
కాగా, కమిటీ సోమవారం కూడా మరోసారి సమావేశం కానుంది. ఇదిలావుంటే, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో సీట్ల పంపంకంపై పార్టీలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. 48 సీట్ల విషయంలో మహావికాస్ అఘాడీతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. సీట్ల పంపకం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ఇండియా కూటమిలో తృణమూల్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మమతను బుజ్జగించడంలో తలమునకలై ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments