Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 16వ తేదీన లోక్‌సభ ఎన్నికలు : ఎన్నికల సంఘం క్లారిటీ

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (10:38 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికలు రెండు మూడు నెలల్లో జరగాల్సివుంది. ఈ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 16వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. 
 
ఏప్రిల్ 16 నుంచి లోక్‌సభ ఎన్నికలు అనే వార్త నిజమేనా అని కొన్ని మీడియా సంస్థలు తమను వాకబు చేస్తున్నాయని ఢిల్లీలోని సీఈవో కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ 16 అనేది లోక్‌సభ ఎన్నికల తేదీ కాదని, దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు తేదీ అని స్పష్టం చేసింది.
 
ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఈ నెల 19న అధికారిక లేఖను జారీ చేశామని వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సరైన సమయంలో ప్రకటిస్తుందని సీఈవో కార్యాలయం ఆ ప్రకటనలో వివరణ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments