Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో లాక్డౌన్... సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (15:20 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించింది. ఇది సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో వుండనుంది. అన్ని పట్టణ ప్రాంతాల్లో ఈ లాక్డౌన్ విధించారు. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, పట్టణాలు, నగరాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌తో సమావేశాన్ని నిర్ణయిస్తామని... ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తిస్తున్నామన్నారు. 
 
మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఉదయం హిందీలో ట్వీట్ చేస్తూ... ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని, చేతులను తరచుగా శానిటైజ్ చేసుకోవాలని సూచించింది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ కు గురికాకుండా చూసుకోవడమే రాష్ట్రానికి ప్రతి ఒక్కరూ చేసే అతి పెద్ద సేవ అని తెలిపింది. గత 24 గంటల్లో మధ్యప్రదేశ్ లో 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.18 లక్షల కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments