Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్రవడ్డీ, ఆలస్య చెల్లింపులపై వడ్డీ విధించొద్దు.. సుప్రీం కోర్టు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (17:33 IST)
రుణ గ్రహీతలకు కాస్త ఊరటనిచ్చేలా గత ఏడాది విధించిన మారటోరియం కాలానికి ఎలాంటి చక్రవడ్డీ, ఆలస్య చెల్లింపులపై వడ్డీ విధించొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే బ్యాంకులు అలా వడ్డీ వసూలు చేసి ఉంటే.. ఆ మొత్తాన్ని రుణగ్రహీతలకు తిరిగి చెల్లించడం లేదా సర్దుబాటు చేయాలని సూచించింది. అయితే.. ఆగస్టు 31 వరకు ఉన్న రుణ మారటోరియం కాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. 
 
పూర్తి వడ్డీ మాఫీ చేయమని కూడా చెప్పలేమని కోర్టు పేర్కొంది. కరోనా మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో చక్రవడ్డీ మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని కోర్టు వెల్లడించింది. అలాగే ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments