Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఉపాధి కోసం వెళ్తే.. ప్రియుడితో భార్య.. సినిమా స్టోరీని తలపించే ఘటన..?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (20:09 IST)
భర్త దూర ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లాడు. భార్య మాత్రం సొంతూళ్లోనే ఉంటుంది. భార్య వేరే వ్యక్తి అక్రమ సంబంధం నెరపడంతో.. భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ప్రియుడిని వివాహం చేసుకుంది. కానీ ఆ తర్వాత వాళ్లిద్దరూ కూడా తనువు చాలించారు. సినిమా స్టోరీని తలపించే ఈ స్టోరీ విశాఖపట్నంలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని సుందరయ్య కాలనీకి చెందిన నాగిణి అనే మహిళకు ఐదేళ్ల క్రితం పాపారావు అనే వ్యక్తితో పెళ్లైంది. వృత్తి రీత్యా అతడు అండమాన్‌లో ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య కలహాలు మొదలై ఏడాది నుంచి విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నాగిణికి అభిలాష్ అనే వ్యక్తితో పరిచయమైంది. 
 
కొన్నాళ్లకు ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అండమాన్‌లో ఉన్న పాపారావుకు విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత పాపారావు బంధువులకు నాగిణికి మధ్య గొడవలు కూడా జరిగాయి. 
 
ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం నాగిణి.. అభిలాష్‌ను వివాహం చేసుకుంది. వీళ్లిద్దరి పెళ్లిని ఇరువైపుల పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదురించి బ్రతకలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంలో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 
 
భార్య తనను మోసం చేసిందని పాపారావు సూసైడ్ చేసుకోగా.. జరిగిన దానికి తలెత్తుకోలేక.. కొత్త జీవితాన్ని పెద్దలు అంగీకరించలేదన్న బాధను భరించలేక నాగిణి-అభిలాష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments