Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసిన కష్టాలు... అమూల్యకు తండ్రి షాక్

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (13:01 IST)
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన 'సేవ్ కాన్‌స్టిట్యూషన్' కార్యక్రమంలో అమూల్య అనే యువతి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. ఈ యువతిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇపుడు ఆమె తండ్రి కూడా తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఇలాంటి కుమార్తెను కన్నందుకు సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. పైగా, ఆమె కోసం తాను ఎలాంటి న్యాయపోరాటం చేయబోనని తేల్చి చెప్పారు. తన మాతృదేశం భారత్ అని, పాకిస్థాన్ అనుకూల శక్తులు ఇక్కడ మనుగడసాగించజాలవన్నారు. 
 
కాగా, గురువారం జరిగిన ఈ సభలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ బెంగుళూరుకు చెందిన అమూల్య అనే యువతి నినాదాలు చేసింది. ఈ నినాదాలు కలకలం రేపాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన తర్వాత వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేసింది.
 
వెంటనే అప్రమత్తమైన ఒవైసీ.. ఆమె వద్దకు వచ్చి మైక్ లాక్కుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆమెకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. తాము ఎప్పటికీ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వబోమని, భారత్‌తోనే ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు. ఇపుడు ఆ యువతి తండ్రి కూడా షాకిచ్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments