Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూంలో దూకిన చిరుత పులి... బిక్కుబిక్కుమంటూ దుప్పటికప్పుకున్న దంపతులు!

కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్‌కు వెళ్లడం సహజమే. అలా హనీమూన్‌కి వెళ్లిన ఒక జంటకు చిరుతపులి చుక్కలు చూపించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని నైనిటాల్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఈ జంట ఏకాంతంగా

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (09:21 IST)
కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్‌కు వెళ్లడం సహజమే. అలా హనీమూన్‌కి వెళ్లిన ఒక జంటకు చిరుతపులి చుక్కలు చూపించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని నైనిటాల్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఈ జంట ఏకాంతంగా గడపాలని ఉత్తరాఖండ్లోని నైనిటాల్‌లో ఒక హోటల్‌లో బసచేశారు. ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో బసచేశారు. వీరిద్దరు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున పెద్ద శబ్దం వినిపించింది. ఏంటా అని లేచి చూసి భయంతో వణికిపోయారు. ఏంటంటే... బాత్రూంలో చిరుతపులి చొరబడింది. చిరుతపులిని చూసిన ఆ జంటకు నోటమాటరాలేదు. ఆ జంట పులిని చూసి భయపడితే, మరోవైపు చిరుతపులి కూడా వారిని చూసి బిక్కుబిక్కుమంటూ ఓ మూల కూర్చుంది. 
 
ఈ విషయంపై స్పందించిన వరుడు హోటల్ సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. తెల్లవారుజామున 4.45 సమయంలో అద్దం పగిలిన శబ్దానికి తాను లేచానని, చూస్తే కిటికీలోంచి చిరుతపులి లోపలకు దూరిందని.. దాంతో వెంటనే తాను, తన భార్య దుప్పటి కప్పేసుకుని దాక్కున్నామని.. చిరుతపులి నేరుగా వెళ్లి బాత్రూంలో దాక్కుందని ఆ వరుడు వాపోయాడు. వెంటనే తాను వెళ్లి బాత్రూం తలుపు గడియ పెట్టి హోట్ యాజమన్యానికి విషయం చెప్పానని వెల్లడించాడు. 
 
హోటల్ యజమాని అమిత్ సా వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లతో పాటు అటవీ శాఖాధికారులు కూడా హోటల్‌కి చేరుకున్నారు. అయితే ఆ చిరుత పులి మాత్రం ఎవరికీ హాని కలిగించలేదు. కుక్కలు వెంటబడడంతో చిరుత ఈ హోటల్లోకి వచ్చిందని అటవీశాఖ అధికారి తెలిపారు. పులిని పట్టుకోవడానికి వల, మత్తు ఇంజెక్షన్లు తీసుకుని వచ్చినా.. చిరుతపులి మాత్రం ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments