Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం, ఆ తరువాత?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:51 IST)
సాఫీగా సాగిపోతున్న కాపురం, ఇద్దరు పిల్లలు. ఆప్యాయంగా చూసుకునే భర్త. అడిగిన వెంటనే స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. ఇంకేముంది ఫేస్‌బుక్ క్రియేట్ చేసింది. అందులో ఫ్రెండ్స్ అంటూ యాడ్ అయ్యారు. అందులో ఒక యువకుడు చెప్పిన మాయమాటలను నమ్మింది. చివరకు పచ్చటి కాపురాన్ని కూల్చుకోవడమే కాదు తన ప్రాణాన్ని కోల్పోయింది.
 
ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా చాపియా చెతన్యాకు చెందిన జాకీ అక్తర్ ముంబయిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మూడేళ్ళ క్రితం సిక్కింలోని గ్యాంగ్ చుంక్‌కు చెందిన దవా పస్సీ శెర్పా అనే వివాహిత పరిచయమైంది. ఆమెకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఫేస్ బుక్ పరిచయం కాస్త చివరకు శెర్పా జీవితాన్ని మార్చేసింది. యువకుడు తన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయని.. నిన్ను పెళ్ళి చేసుకుంటాను వచ్చేయమంటూ ఫోన్లో పదేపదే చెప్పేవాడు. దీంతో ఆమె నమ్మింది. ముంబైకు వెళ్ళిపోయింది. తన స్నేహితుడి గదిలో ఉంచి రెండు నెలల పాటు ఆమెతో సహజీవనం చేశాడు అక్తర్. అయితే పెళ్ళి చేసుకుందామని శెర్పా పట్టుపట్టింది. కానీ అందుకు అతను ఒప్పుకోలేదు.
 
తన శారీరక వాంఛ తీర్చుకున్న తరువాత ఇక ఆమె అనవసరమనుకున్నాడు. ఎలాగైనా చంపేయాలనుకుని ప్లాన్ చేశాడు. తమ్ముడు సహాయంతో ఆమె గొంతు నులిమి అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. హత్య కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments