విజయవంతంగా తేజస్ ఎంకే1ఏ వెర్షన్ గగన విహారం

వరుణ్
శుక్రవారం, 29 మార్చి 2024 (12:49 IST)
భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. దీన్ని మరింత ఆధునికీకరించి తేజస్-ఎంకే 1ఏ వెర్షన్‌కు రూపకల్పన చేశారు. ఇప్పుడీ సరికొత్త పోరాట విమానం తొలిసారిగా పూర్తిస్థాయిలో విజయవంతంగా గగన విహారం చేసింది. ఇప్పటికే ఈ తేలికపాటి యుద్ధ విమానం భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. 
 
గురువారం బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశస్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్‌‌మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్‌ను డిజైన్ చేసింది. తేజస్ ఎంకే 1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది.
 
గత కొన్నేళ్లుగా అనేక పర్యాయాలు తేజస్ యుద్ధ విమానాలకు ట్రయల్స్ నిర్వహించారు. గురువారం నాటి గగన విహారం 18 నిమిషాల పాటు సాగింది. రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు. త్వరలోనే ఈ విమానాలను వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments