Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దె చెల్లించాల్సిందే... లతా రజినీకాంత్‌కు చుక్కెదురు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ విద్యా సంస్థలతో పాటు.. ఓ ట్రావెల్ సంస్థను కూడా నడుపుతోంది. ఈ రెండు కూడా అపుడపుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (11:00 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ విద్యా సంస్థలతో పాటు.. ఓ ట్రావెల్ సంస్థను కూడా నడుపుతోంది. ఈ రెండు కూడా అపుడపుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా ట్రావెలర్స్ సంస్థ దుకాణం అద్దె పెంపు వ్యవహారంలో ఆమెకు కోర్టులో చుక్కెదురైంది. చెన్నై నగర పాలక సంస్థ నిర్ణయించిన అద్దెను చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో భవన సముదాయాలలోని ఓ గదిని అద్దెకు తీసుకుని ట్రావెలర్స్‌ సంస్థను నడుపుతున్నారు. కొన్నేళ్లుగా ఆ దుకాణానికి నెలకు రూ.3702లను కార్పొరేషన్‌కు అద్దెగా చెల్లిస్తూవచ్చారు. గత జూన్‌లో కార్పొరేషన్‌ ఆ దుకాణం ఉన్న గది అద్దెను రూ.21,160లకు పెంచింది. ఈ అద్దె పెంపును సవాలు చేస్తూ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 
 
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి వైద్యనాథన్‌ విచారణ జరిపి అద్దెను రూ.21160గా ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు 92 ప్రకారం ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి అద్దెకిచ్చిన కార్పొరేషన్‌ భవనాల అద్దెను పెంచాల్సి ఉందని, లతా రజనీకాంత్‌ నడుపుతున్న ట్రావెలర్స్‌ సంస్థ అద్దెను కూడా ఆ చట్టం ప్రకారంమే చెల్లించాల్సిందని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments