Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాన్స్ నాయక్ హనుమంతప్ప అంత్యక్రియలు పూర్తి.. అధికారిక లాంఛనాలతో...

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (16:36 IST)
భారత వీర జవాను లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో శుక్రవారం పూర్తయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలోని స్వగ్రామంలో జరిగిన అంతిమ యాత్రంకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం హనుమంతప్ప భౌతికకాయాన్ని హుబ్లీలో ఉంచారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 
 
పార్థివ దేహాన్ని ఉంచిన హుబ్లీ నెహ్రూ స్టేడియం జనంతో నిండిపోయింది. నివాళులర్పించేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సైనికులు, పోలీస్‌ అధికారులు వచ్చారు. హనుమంతప్ప అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. ఆరు రోజుల పాటు హనుమంతప్ప సియాచిన్‌ మంచు కొండల్లో సజీవంగా ఉన్నారు. ఆయనను బయటకు తీసిన సైనికులు ఢిల్లీలోని ఆర్మీ ఆప్పత్రిలో చికిత్స అందించారు. చివరికి మనుమంతప్ప గురువారం ఉదయం 11-45 గంటలకు మృతిచెందారు. 
 
మరోవైపు.. అమర జవాను హనుమంతప్ప కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రకటించారు. అలాగే, సియాచిన్‌ మంచు కొండల్లో ప్రాణాలు వదిలిన ముగ్గురు కన్నడ జవాన్ల కుటుంబాలకు తగిన సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హనుమంతప్ప పార్ధీవ దేహాన్ని హుబ్లీ వద్ద ఆయన స్వగ్రామానికి తరలించారు. సీఎం సిద్ద రామయ్య అక్కడకు చేరుకుని హనుమంతప్ప కుటుంబాన్ని ఓదార్చారు. ప్రజలంతా అమరజవాను భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments