Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖ్వీకి బెయిల్ మంజూరు అద్వానీ.. జవదేకర్ ఆగ్రహం!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:40 IST)
ముంబై దాడుల కేసులో ప్రధాన సూత్రధారి అయిన లఖ్వీకి పాక్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని బీజేబీ అగ్రనేత ఎల్కే. అద్వానీ, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌లు తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు తీవ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని ప్రకటించిన మరుసటి రోజునే లఖ్వీకి బెయిల్ మంజూరు కావడం భారత్‌ విస్మయం వ్యక్తం చేస్తోంది. 
 
ఇదే అంశంపై బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ స్పందిస్తూ.. పాకిస్థాన్‌లో అంతే. ఈ తీర్పు పాకిస్థాన్‌ ప్రతిష్టను దిగజారుస్తుందన్నారు. వారి న్యాయవ్యవస్థపై నేనేమి మాట్లాడబోనని చెప్పారు. ఎన్సీపీ నేత మజీద్‌ మెమన్‌ మాట్లాడుతూ పెషావర్‌లో చిన్నపిల్లలను ఉగ్రవాదులు చంపిన ఘటన ఇంకా మరిచిపోలేదని, దాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. ఉగ్రవాదులను ఏరివేస్తామని పాక్‌ నేతలు చెబుతున్నారని, ఇలాంటి సమయంలో బెయిల్‌ రావడం విచారకరమని ఆయన అన్నారు. 
 
కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ ఇదే అంశంపై లఖ్వీ లాంటి ఉగ్రవాదికి బెయిల్‌ రావడం విచారకరమన్నారు. ఉగ్రవాదికి బెయిల్‌ ఇవ్వడం వల్ల పాక్‌ ప్రతిష్ట మరింత దిగజారితుందన్నారు. ఉగ్రవాదులను అంతం చేస్తామని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీప్‌ చెప్పారని... దాన్ని ప్రపంచమంతా స్వాగతించిందని... ఇప్పుడు ఉగ్రవాది రహ్మన్‌ లఖ్వీకు బెయిల్‌ వచ్చిందని మండిపడ్డారు. లఖ్వీ, హఫీజ్‌ సయీద్‌తో కలిసి ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడని జవదేకర్‌ ఆరోపించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments