Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం లేడీ సింగం రాభాను చంపేశారా?

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (18:31 IST)
అస్సాంకు చెందిన మహిళా పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ సందేహాలను బలపరిచేలా ఇప్పటికే ఓ ఆడియో, వీడియో క్లిప్‌ వైరల్ కాగా.. వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదిక మరింత చర్చనీయాంశంగా మారింది. ముందస్తు పథకం ప్రకారమే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానం అందులో వ్యక్తమైంది. నివేదికలో వైద్యులు పేర్కొన్న వివరాల ప్రకారం.. 
 
రాభాను శరీరంపై పలు చోట్ల, తల వెనుక భాగంలో గాయాలున్నాయి. ప్రమాదం తర్వాత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా.. అది పూర్తిగా బిగుసుకుపోయిన స్థితిలో ఉంది. సాధారణంగా ఒక మనిషి చనిపోయిన కొన్ని గంటల తర్వాత శరీరం అలా మారుతుంది. 
 
ఘటనాస్థలం నుంచి వెలుగులోకి వచ్చిన దృశ్యాల్లో ప్రమాదం సమయంలోనే ఆమె శరీరం బిగుసుకుపోయిందని తెలుస్తోంది. కాళ్లూ చేతులు వాటి జాయింట్స్ వద్ద రాసుకుపోయిన గాయాలు, నుదురు ఎడమవైపు భాగంలో లోతుగా గాయం ఏర్పడింది. తల వెనకవైపు ఎముక విరిగి ఉంది. ఛాతి, పొత్తికడుపు మధ్యభాగంలో ఎర్రగా కందిపోయిన గాయాలున్నాయి. 
 
రక్తస్రావం, షాక్‌ వల్ల గుండె, శ్వాస వ్యవస్థల వైఫల్యంతో మరణం సంభవించింది. వాటికి పొత్తికడుపు, మెదడులో గాయాలు తోడయ్యాయి అని వైద్యులు నివేదికలో చివరిగా ఒక అంచనాకొచ్చారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఘటన కావడానికి ఆస్కారం ఎక్కువ. ఆ గాయాలు ట్రక్కు ఢీకొనడం వల్ల జరిగినవిగా కనిపించడం లేదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments