Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామా చేయాలనిపిస్తోంది... వాజ్‌పేయి ఉంటే బాధపడేవారు : ఎల్కే.అద్వానీ

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:01 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ నోట్ల రద్దుపై సభలో చర్చించాలని పట్టుబట్టి.. సభా కార్యక్రమాలను సాగనీయకుండా చేశాయి. ఈ తీరుపై అద్వానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మొదట కేంద్ర మంత్రి అనంతకుమార్‌ వద్ద ప్రస్తావించారు. 
 
ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు. అద్వానీ మాటలను రాజ్‌నాథ్ శ్రద్ధగా ఆలకించారు. "కనీసం ఈ రోజు ఒక రోజైనా సమావేశాలు సజావు‌గా జరపాలని లేదా జరిగేలా చూడాలని" రాజ్‌నాథ్‌తో అద్వానీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారంటూ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments