Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాలిన్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌లో చేరలేదు: ఖుష్బూ

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (12:04 IST)
డీఎంకే కోశాధికారి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని సినీ నటి ఖుష్బూ స్పష్టం చేశారు. డీఎంకే నుంచి వైదొలగి కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్న ఆమె.. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఎంకేను గానీ లేదా ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్‌ను ఢీకొట్టేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీపై తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీని చాలా మంది నేతలు వీడుతుంటే తాను ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు. 
 
కుల, మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమ న్యాయం చేయగల ఏకైక లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని అందువల్లే ఆ పార్టీలో చేరినట్టు తెలిపారు. పైగా ముంబైలో పుట్టి పెరగడం వల్ల తాను చిన్న వయస్సు నుంచే కాంగ్రెస్ పార్టీపై మంచి అభిమానం ఉందన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. అదేసమయంలో తాను పదవులకు ఆశపడి పార్టీలో చేరలేదన్నారు. 
 
డీఎంకేలో ఉన్న సమయంలో నాలుగేళ్ళ పాటు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశానని, పదవి కావాలంటే ఆ పార్టీలోనే అడిగి తీసుకుని ఉండేదాన్నన్నారు. కానీ, తనకు పదవుల కంటే పార్టీయే గొప్పదన్నారు. అయితే, తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తన వంతు కృషి చేస్తానని చెప్పారు.  

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments