Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజలపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త చట్టంపై కేంద్రం సన్నాహాలు.. టీవీ సీరియళ్లపై బ్యాన్

క్షుద్రపూజలపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. చేతబడులు, బాణామతి, క్షుద్రపూజలంటూ ప్రజల్ని మోసం చేసే వారికి కఠిన శిక్షలు పడేలా.. వాటి నియంత్రణకు జాతీయ స్థాయిలో ఓ కొత్త చట్టాన్ని తీసుక

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (11:24 IST)
క్షుద్రపూజలపై కేంద్రం ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. చేతబడులు, బాణామతి, క్షుద్రపూజలంటూ ప్రజల్ని మోసం చేసే వారికి కఠిన శిక్షలు పడేలా.. వాటి నియంత్రణకు జాతీయ స్థాయిలో ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేపట్టింది. దీనిపై అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది. క్షుద్రపూజలు, చేతబడులను అరికట్టడానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న చట్టాల గురించి తెలపాలని ఆ లేఖలో పేర్కొంది. 
 
క్షుద్రపూజలు, చేతబడులు, బాణామతి పేరిట కొందరు మోసగాళ్లు చేస్తున్న మాయల్ని నమ్మి ఎంతోమంది ప్రజలు మోసపోతున్నారు. ప్రజల భయాన్ని, వారి మానసిక రుగ్మతను అదునుగా తీసుకున్న మాయగాళ్లు చేతబడులు, క్షుద్రపూజలంటూ వారిని దోచుకుంటున్నారు. చేతబడులు చేస్తున్నారంటూ కొందరు అమాయకులను అమానుషంగా కొట్టి చంపేస్తున్న ఘటనలూ జరుగుతున్నాయి. 
 
ఇటీవల మహారాష్ట్రలో క్షుద్రపూజలు చేశాడని అనుమానించి అక్కడి వారంతా ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపారు. దాంతో ఆ రాష్ట్రంలో కల్లోలం మొదలైంది. క్షుద్రపూజలను నమ్మి మోసపోవద్దంటూ ఓ సామాజిక సేవా సంస్థ ప్రచారం చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు నడుం బిగించింది.

మోసం చేశాక కేసులు పెట్టడం కాకుండా.. క్షుద్రపూజలు చేసేవారి సమాచారం తెలియగానే కేసులు పెట్టేలా, సినిమాలు-టీవీ సీరియళ్లలో ఇలాంటివాటిని ప్రేరేపించే దృశ్యాలపై నిషేధం విధించేలా కూడా కొత్త చట్టం ఉండే అవకాశం ఉందని సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం