Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ ముఖ్యమంత్రి మమతాపై నమ్మకం పోయింది.. మెడికో తండ్రి..

ఠాగూర్
సోమవారం, 19 ఆగస్టు 2024 (12:17 IST)
ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని, ఒక ఆడబిడ్డగా తండ్రిగా తన కుమార్తెను హత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పదేపదే విజ్ఞప్తి చేసినా ఆమె పెద్దగా స్పందించలేదని, న్యాయం చేసేందుకు ఆమె పెద్దగా ప్రయత్నాలు చేయలేదని మృతురాలి తండ్రి బోరున విలపిస్తూ చెప్పుకొచ్చారు.
 
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల పట్ల మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందుతున్నారు. మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని అన్నారు.
 
'ఇంతకుముందు మమతా బెనర్జీపై ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడా భావన పోయింది. ఆమె కూడా న్యాయం చేయాలని అడుగుతున్నారు. కానీ ఆ దిశగా ఆమె చేస్తున్నది ఏమీ లేదు. ఓవైపు ఆమె న్యాయం కావాలి అంటూనే... న్యాయం కావాలి అని నినదిస్తున్న సాధారణ ప్రజలను నిర్బంధిస్తున్నారు. ఆమె ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదు. 
 
ఈ హత్యాచార ఘటనలో సీసీటీవీ ఫుటేజి ప్రకారం సంజయ్ రాయ్‌ని అరెస్టు చేశారు. కానీ ఒక్కడి వల్ల ఈ ఘాతుకం జరిగి ఉండదని, ఇందులో ఇతరులు కూడా ఉండొచ్చని అందరూ అంటున్నారు. మేం మొదటి నుంచి ఇదే చెబుతున్నాం' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments