Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా మెడికో హత్య కేసు : నిందితుడు సంజయ్ రాయ్ నేపథ్యం ఏంటి?

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (18:29 IST)
కోల్‌కతా మెడికో హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ నిందితుడి గురించి కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వివాహితుడైన సంజయ్ రాయ్‌కు భార్యకు మధ్య సత్సంబంధాలు లేవని స్వయంగా అత్త దుర్గాదేవి వెల్లడించారు. కొంతకాలం క్రితం అతడు భార్యపై చేయి చేసుకోవడంతో ఆమెకు గర్భస్రావమైనట్లు తెలిపారు. సంజయ్ మంచివాడు కాదని అభిప్రాయపడ్డారు. అతన్ని ఏం చేసినా ఫర్వాలేదని.. ఉరితీసినా సరేనని ఆమె చెప్పుకొచ్చారు. సంజయ్ రాయ్ చేసిన నేరం గురించి మాత్రం తాను మాట్లాడలేనని దుర్గాదేవి అన్నారు. అంతటి నేరానికి పాల్పడే శక్తి అతడికి ఒక్కడికే లేదని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. మరికొంత మంది ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
'అతడితో మాకు సత్సంబంధాలు లేవు. నా కూతురితో అతడికి పెళ్లయి రెండేళ్లు అవుతోంది. అతడికి నా కూతురు రెండో భార్య. వివాహమైన తొలి ఆరు నెలలు అంతా సవ్యంగానే సాగింది. గర్భం దాల్చినట్లు నిర్ధారణ కాగానే క్రమంగా గొడవలు ప్రారంభమయ్యాయి. మూడు నెలల గర్భంతో ఉన్నప్పుడు నా కూతురిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమెకు గర్భస్రావమైంది. కేసు కూడా నమోదు చేశాం. అప్పటి నుంచి నా కూతరు అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వైద్య ఖర్చులన్నీ నేనే భరిస్తున్నాను' అని సంజయ్ రాయ్ గురించి దుర్గాదేవి మీడియాకు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments