మాస్క్ ధరించేందుకు నిరాకరించిన కొడుకుని చంపేసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (10:17 IST)
ప్రపంచం కరోనా గుప్పెట్లో చిక్కుకుంది. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకే లాక్‌డౌన్‌ను కేంద్రం అమలు చేస్తోంది. ముఖ్యంగా ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు.. బయటకు వెళితే ముఖానికి మాస్కులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లేటపుడు మాస్క్ ధరించేందుకు నిరాకరించిన ఓ కొడుకును దారుణంగా చంపేశాడో కుమారుడు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతా నగరంలోని షోవాబజార్‌కు చెందిన 78 ఏళ్ల బన్సిధర్ మల్లిక్‌గా పోలీసులు గుర్తించారు. వారి కథనం ప్రకారం.. 
 
షోవాబజార్‌కు బన్సిధర్ కుమారుడు శీర్షేందు మల్లిక్ (45) దివ్యాంగుడు. శనివారం అతడు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మాస్క్ ధరించాలని తండ్రి కోరాడు. అందుకు శీర్షేందు నిరాకరించడంతో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఓ గుడ్డముక్కతో కుమారుడి గొంతు బిగించాడు. ఫలితంగా ఊపిరి ఆడక శీర్షేందు ప్రాణాలు కోల్పోయాడు.
 
అనంతరం నిందితుడు బన్సిధర్ శ్యాంపుకుర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయి జరిగిన విషయం చెప్పాడు. అతడు చెప్పింది విన్నవెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments