Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల్య వివాహాల్లో ఉత్తరప్రదేశ్ టాప్.. గ్రామాల్లో 82 శాతం బాల్య వివాహాలు

ప్రపంచంలో బాల్య వివాహాలు చేసుకుని ప్రతి ముగ్గురిలో ఒకరు భారత్‌లో ఉన్నారని.. బాల్య వివాహాలపై 'యాక్షన్‌ ఎయిడ్‌ ఇండియా' సొసైటీ 2011 జన గణన ప్రాతిపదికగా ''భారత్‌లో బాల్య వివాహాల నిర్మూలన'' పేరుతో విడుదల చ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (13:58 IST)
ప్రపంచంలో బాల్య వివాహాలు చేసుకుని ప్రతి ముగ్గురిలో ఒకరు భారత్‌లో ఉన్నారని.. బాల్య వివాహాలపై 'యాక్షన్‌ ఎయిడ్‌ ఇండియా' సొసైటీ 2011 జన గణన ప్రాతిపదికగా ''భారత్‌లో బాల్య వివాహాల నిర్మూలన'' పేరుతో విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం బాల్య వివాహాలే జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. మొత్తం 10 కోట్ల మంది భారతీయులలో 8.5 కోట్ల మంది బాలికలు 18 ఏళ్ళ వయస్సు రాక ముందే వివాహం చేసుకుంటున్నారని నివేదిక ద్వారా తేలింది. 
 
వివాహ వయస్సు మెరుగుదల కన్పించినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా జరిగే బాల్య వివాహాలలో 33 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. భారత్‌లో వివాహం చేసుకున్న మహిళల్లో 30.2 శాతం మంది వధువులు బాలలేనని వెల్లడైంది. 2007-2011 మధ్య కాలంలో 82 శాతం బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయని నివేదిక పేర్కొంది. భారత్‌లో అత్యధిక బాల్య వివాహాలు జరిగే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. 
 
దాదాపు 16.6 శాతం బాల్య వివాహాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. 2011 గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బీహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో70 శాతం బాల్య వివాహాలు జరిగాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments