Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసే ప్లేట్లతో టాయిలెట్ క్లీన్ చేయిస్తారా?

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు తినేందుకు ఉపయోదించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్ చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంల

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (10:00 IST)
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు తినేందుకు ఉపయోదించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్ చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు విద్యార్థులు టాయిలెట్స్‌ క్లీన్‌ చేయించారు. 
 
దీంతో స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు... టాయిలెట్‌‌లోని వ్యర్థాలను తినే ప్లేట్లతో ఎత్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారంతా టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్లు పిల్లల తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులంతా పాఠశాలలో ఆందోళన చేపట్టారు. 
 
కానీ తల్లిదండ్రుల ఆరోపణలను పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని చెప్పారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments