జయలలిత వీడియోతోనే దినకరన్‌కు గెలుపు.. డబ్బే గొప్పది: కేతిరెడ్డి

ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రి వీడియోను విడుదల చేయడం శశికళ మేనల్లుడు దినకరన్‌కు కలిసొచ్చిందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యాన

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (11:15 IST)
ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రి వీడియోను విడుదల చేయడం శశికళ మేనల్లుడు దినకరన్‌కు కలిసొచ్చిందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు.

లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాను తెరకెక్కించనున్న కేతిరెడ్డి ఆర్కేనగర్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆర్కే నగర్‌లో ఎక్కువగా నిరుపేద ఓటర్లు వున్నారు. వారికి భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారు. దినకరన్ గెలుపుకు ఇదే కారణమని, రెండాకుల గుర్తు వచ్చిందనే ధీమాలో అన్నాడీఎంకే ఉండిపోయిందని... గుర్తు కంటే డబ్బే గొప్పది అనే విషయాన్ని వారు మరిచిపోయారని కేతిరెడ్డి చెప్పారు. 
 
తమిళనాడులో బీజేపీ వచ్చే ఛాన్స్ లేదని.. ఈ ఎన్నికల్లో తేలిపోయిందని చెప్పారు. దినకరన్ గెలుపుతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. దినకరన్ విజయానికి, అన్నాడీఎంకే ఓటమికి తెలుగు ఓటర్లే కారణమని చెప్పారు. 

హీరో విశాల్ నామినేషన్‌ను అధికార అన్నాడీఎంకే నేతలు రద్దు చేయించారనే ఆరోపణలు రావడం కూడా ఆ పార్టీని దెబ్బతీసిందని అన్నారు. దినకరన్ గెలుపుకు కేవలం డబ్బు మాత్రమే కారణమని.. ఇప్పటి వరకు ఆర్కేనగర్‌కు ఏం చేశారో దినకరన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments