Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత కట్నం తేలేదన్న కోపంతో కోడలిని కడుపు మాడ్చి చంపేశారు...

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (10:12 IST)
అడిగినంత కట్నం తేలేదన్న కోపంతో ఇంటి కోడలిని కడుపుమాడ్చి చంపేశారో అత్తింటివారు. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కొల్లాం సమీపంలోని కరునాగపల్లికి చెందిన తుషార(27) అనే యువతికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. తుషారకు 2013లో వివాహం జరుగగా, కొంత డబ్బు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. రూ.2 లక్షలు తర్వాత ఇస్తామని మాటిచ్చారు. కానీ ఆ డబ్బును ఇవ్వలేక పోయారు. తుషార భర్త వెల్డింగ్‌ వృత్తిలో ఉన్నాడు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే, తాము అడిగినంత కట్నం తేలేదన్న కోపంతో కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తుషార భర్త చందూలాల్, అత్త గీతాలాల్‌లు, గత ఐదేళ్లలో ఆమెకు ఎన్నడూ అన్నం పెట్టలేదు. నిత్యమూ నానబెట్టిన బియ్యాన్ని తింటూ వచ్చిన తుషార, బక్కచిక్కి, బలహీనమై పోయింది. దీంతో తీవ్ర అనారోగ్యానికిగురైన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై తుషార తల్లిదండ్రులు అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. 
 
ఐదేళ్లుగా పిడికెడు అన్నం పెట్టని కారణంగా ఆమె బక్కిచిక్కిపోయింది. శరీరం ఎముకల గూడులా మారి, చిక్కి శల్యమైపోయింది. కండరాలు లేక, 20 కిలోల ఎముకల గూడులా మారిపోయి మరణించినట్టు తేలింది. దీంతో భర్త, అత్తలను అరెస్టు చేశారు. 
 
తన కుమార్తె మరణంపై తల్లిదండ్రులు స్పందిస్తూ, గత ఐదేళ్లుగా తుషారను కట్నం కోసం వేధిస్తున్నారని, ఏడాది కాలంగా తమ కుమార్తెను కలుసుకోనీయలేదని ఆమె తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. తమ కుమార్తెను ఎంతగా హింసించినా, ఆమె జీవితం ఇబ్బందిలో పడుతుందనే భయంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. భర్త, అత్త మానసికంగా, శారీరకంగా వేధించినట్లు పొరుగింటి వ్యక్తి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments