Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళాలో మళ్లీ తుఫాన్ ప్రభావం.. 24 గంటల్లో భారీవర్షాలు... సీఎం విజయన్..

కొన్ని రోజుల క్రితం విపరీతమైన వర్షాలతో మునిగి తేలిన కేరళ రాష్ట్రంలో మళ్లీ తుఫాన్ ప్రారంభమైంది. ఈ తుఫాన్ కారణంగా కేరళ రాష్ట్రంలో మళ్లీ భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలియజేసింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (12:58 IST)
కొన్ని రోజుల క్రితం విపరీతమైన వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో మళ్లీ తుఫాన్ ప్రారంభమైంది. ఈ తుఫాన్ కారణంగా కేరళ రాష్ట్రంలో మళ్లీ భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలియజేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం వలన కేరళలోని మూడు జిల్లాలలో భారీవర్షాలు కురుసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు.
 
అక్టోబర్ 7వ తేది నుండి కేరళలోని ఇడుక్కి, పాలక్కాడ్, త్రిస్సూర్ జిల్లాలలో భారీవర్షాలు కురుస్తాయని కేరళ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ విషయం అక్కడి ప్రజలకు ఆందోళన కలిగించింది. అందువలన, ప్రజలు తుఫాన్ నేపథ్యంలో తీరప్రాంతాల వాసులు, మత్స్యకారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్‌‌‌‌‌‌ కోరారు. 
 
ఇక 24 గంటల్లో 12 నుండి 20 సెంటీమీటర్ల మేరకు భారీవర్షపాతం కురిసే అవకాశాలున్నాయని కేరళ వాతావరణ శాఖ తెలియజేసింది. అందువలన పర్యాటకులు కొండప్రాంతాలు, సముద్ర తీరప్రాంతాలు వెళ్లకూడదని కేరళ సీఎం విజయన్ కోరారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments