Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరం లేని నాలుక : కరోనా కేసులు పెరగడానికి కాంగ్రెస్ ర్యాలీలే కారణం!

Webdunia
మంగళవారం, 11 మే 2021 (13:49 IST)
మనిషికి ఉండే నాలుకకు నరంలేదని, అదెలా మాట్లాడితే అలా మాట్లాడుతుందని మన పెద్దలు అంటుంటారు. దేశంలో కరోనా వైరస్ సంక్షోభంలో కూరుకునిపోవడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు.. బీజేపీ నేతలు చేపట్టిన ఎన్నికల ర్యాలీలేనంటూ అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. కానీ, ఈ వార్తలు బీజేపీ నేతలకు వినిపించడం లేదు. కనిపించడం లేదు. పైగా, దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ర్యాలీలేనంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎదురుదాడికి దిగారు. అంతేకాదండోయ్.. కరోనాపై యావత్ దేశం చేస్తున్న పోరాటాన్ని బలహీనపరచవద్దంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. 
 
కరోనా మహమ్మారి అంశాన్ని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. కరోనాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని... అయినప్పటికీ కేంద్రంపై విమర్శలు గుప్పించడమే పనిగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు.
 
కరోనా కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేస్తున్నారని నడ్డా తెలిపారు. అందరు ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని పని చేస్తున్నారని చెప్పారు. మన భారతీయ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లపై తొలుత కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటివరకు 16 కోట్ల వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేసిందని... ఇందులో 50 శాతం టీకాలను ఉచితంగా అందించిందని చెప్పారు.
 
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నారని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ను ఫ్రీగా ఎందుకు ఇవ్వడం లేదని నడ్డా ప్రశ్నించారు. అసత్య ప్రచారం చేయడంలో రాహుల్ గాంధీని మించినవారు లేరని చెప్పారు. లాక్డౌన్ విధించడాన్ని తొలుత రాహుల్ వ్యతిరేకించారని... ఇప్పుడు లాక్డౌన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 
ఎక్కడ పడితే అక్కడ నిరసన కార్యక్రమాలను చేపట్టడం, కరోనా వ్యాప్తి చెందే కార్యక్రమాలకు హాజరవడం వంటివి చేశారని అన్నారు. కేరళలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన భారీ ఎన్నికల ర్యాలీలే ఆ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కారణమని ఆరోపించారు.
 
ఢిల్లీలో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఇప్పటిది కాదని... 2012లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే దానిపై డిమాండ్లు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ... కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శలు మానుకోలేదని మండిపడ్డారు. 
 
గత 70 ఏళ్లలో ఆరోగ్య రంగంలో మన దేశం పెట్టిన పెట్టుబడులు చాలా తక్కువని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది ఏ పార్టీ? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యరంగంలో అనేక మార్పులను తీసుకొచ్చిందని జేపీ నడ్డా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments