Webdunia - Bharat's app for daily news and videos

Install App

A Political Love Story : సబ్ కలెక్టర్‌ను ప్రేమించి పెళ్లాడనున్న ఎమ్మెల్యే...

ప్రేమకు ఎవరూ అతీతులు కాదు. అధికారదర్పంతో పని లేదు. ప్రజాప్రతినిధా? కలెక్టరా? అనేది అస్సలే అక్కర్లేదు. అందుకే ప్రేమ గురించి పలువురు పలు విధాలుగా చెపుతుంటారు. తాజాగా, ఓ ఎమ్మెల్యేగారు.. సబ్ కలెక్టర్‌ను ప

Webdunia
బుధవారం, 3 మే 2017 (13:10 IST)
ప్రేమకు ఎవరూ అతీతులు కాదు. అధికారదర్పంతో పని లేదు. ప్రజాప్రతినిధా? కలెక్టరా? అనేది అస్సలే అక్కర్లేదు. అందుకే ప్రేమ గురించి పలువురు పలు విధాలుగా చెపుతుంటారు. తాజాగా, ఓ ఎమ్మెల్యేగారు.. సబ్ కలెక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోనున్నారు. ఇది కేరళ రాష్ట్రంలో జరిగనుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేరళ రాష్ట్రంలోని అరువిక్కర నియోజకవర్గ ఎమ్మెల్యే శబరినాథన్. ఈయన తిరువనంతపురం సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న దివ్య అయ్యర్‌పై మనసుపడ్డారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. వారిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేగారు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన ప్రియురాలితో ఉన్న ఫోటోను శబరినాథన్ పోస్ట్ చేశాడు. 
 
తన ప్రేమ గురించి ఎమ్మెల్యే స్పందిస్తూ.. తిరువనంతపురంలో మొదటిసారి దివ్యను కలిశానని, అప్పుడే తమ ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉన్నట్లు తెలిసిందని, ఆ సమయంలోనే తన మనసులో మాటను దివ్యతో చెప్పానని ఎమ్మెల్యే శబరినాథన్ వివరించాడు. తమ పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు సమ్మతించారని, అందువల్ల త్వరలోనే సబ్ కలెక్టర్‌ను పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, కేరళ మాజీ స్పీకర్ కుమారుడైన శబరినాథన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్... తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. తిరువనంతపురంలోని అరువిక్కర నియోకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున 2015లో పోటీ చేసి గెలిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments