Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికుడి కడుపులో కేజీ బంగారం.. ఎలా సాధ్యం?

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (11:11 IST)
ఇటీవలికాలంలో విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే ప్రయాణికులు భారీ మొత్తంలో అక్రమంగా బంగారాన్ని తీసుకొస్తూ ఆయా విమానాశ్రయాల్లో పట్టుపడుతున్నారు. తాజాగా ఓ ప్రయాణికుడు కేజీ బంగారాన్ని తీసుకొస్తూ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ విమానాశ్రయంలో జరిగింది. ఈ ప్రయాణికుడి కడపులో నుంచి ఏకంగా 1140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
సింగపూర్ నుంచి కోళికోడ్‌కు వచ్చిన విమానశ్రయ ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీలు చేశారు. ఈ తనికీల్లో మలప్పురం జిల్లా వరియంకోడ్‌కు చెందిన నౌఫల్ (36) అనే వ్యక్తి దుబాయ్ నుంచి కోళికోడ్‌కు వచ్చాడు. అతన్ని అనుమానించి ఎయిర్ పోర్టు అధికారులు నిశితంగా తనిఖీ చేయడమే కాకుండా, పొట్టను స్కాన్ చేశారు.
 
ఇందులో ఆయన కడుపులో 1.063 కేజీల బంగారాన్ని క్యాప్సూల్స్‌గా మార్చి అక్రమంగా తీసుకొచ్చాడు. కస్టమ్స్ అధికారుల సాధారణ తనిఖీల్లో ఈ విషయం వెల్లడికాలేదు. అయినప్పటికీ వారికి అనుమానం వచ్చి ఆ ప్రయాణికుడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి స్కాన్ చేయగా అసలు విషయం వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments