Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమను తిరస్కరించిందనీ.. అందరూ చూస్తుండగానే వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు!

కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులో ఓ అబ్బాయి పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:51 IST)
కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది. అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులో ఓ అబ్బాయి పెట్రోలు పోసి తగలబెట్టేశాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కొట్టాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో భాగంగానే స్కూల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఎస్ఎంఈ) ఉంది. ఈ కాలేజీలో చదివే విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం కొందరు విద్యార్థులు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆదర్శ్ అనే యువకుడు అదే కాలేజీలో చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడు క్లాసులోకి నడుచుకుంటూ వచ్చి 23 యేళ్ళ యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. 
 
పెట్రోల్ పోసిన వెంటనే ఆ అమ్మాయి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఆదర్శ్ వెంటపడి పట్టుకుని మరీ తన వద్ద ఉన్న లైటర్‌తో ఆమె దుస్తులకు నిప్పంటించాడు. తర్వాత తను కూడా తన దుస్తులకు కూడా అదే లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆస్పత్రిలో మరణించారు. వీరిద్దరూ ఫిజియోథెరపీ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్నారు.  
 
దీనిపై కొందరు విద్యార్థులు స్పందిస్తూ.. మృతులిద్దరూ కొంతకాలం క్రితం ప్రేమించుకున్నారు. అయితే, యువతి తల్లిదండ్రులు వారి ప్రేమకు అడ్డు చెప్పడంతో ఆదర్శకు దూరంగా ఆమె ఉంటూ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని కొల్లంకు చెందిన ఆదర్శ్... పలువురమార్లు ఆమెను బెదిరించాడు. అయితే, ఆ యువతి తన ప్రేమను నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు అశ్విన్ అనే విద్యార్థి చెప్పుకొచ్చాడు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments