ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

ఠాగూర్
శుక్రవారం, 1 ఆగస్టు 2025 (10:55 IST)
మందు బాబులకు కేరళ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. మద్యం తాగిన తర్వాత ఖాళీ బాటిల్‌ను తిరిగి దుకాణంలో ఇస్తే రూ.20 చెల్లిస్తామని వెల్లడించింది. అయితే, ఇక్కడో మెలిక పెట్టింది. ముందుగా ప్రతి మద్యం బాటిల్‌పై రూ.20 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ.20 ముందస్తు డిపాజిట్ చేయించుకొని, ఆ బాటిల్‌ను తిరిగి అదే అవుట్ లెట్‌లు డిపాజిట్ చేస్తే, ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. త్వరలో దీనిని అమలు చేయనున్నారు. మద్యం సేవించిన అనంతరం బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారవేయడం వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 
రాష్ట్రవ్యాప్తంగా బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 70 కోట్ల సీసాల మద్యం విక్రయాలు జరుగుతున్నాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అయితే, మొత్తం అమ్ముడవుతున్న మద్యం బాటిళ్లలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి, మిగిలినవి వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ వెల్లడించారు. సాధ్యమైనంత వరకు గాజు సీసాల్లోనే మద్యం నింపాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాని పక్షంలో రూ.800 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన మద్యాన్ని గాజు సీసాల్లోనే విక్రయించాలని, తక్కువ ధర కలిగిన మద్యాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో నింపవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని సెప్టెంబరులో కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టి, జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

Srikanth: ఇట్లు మీ వెధవ.. సినిమా చిత్ర బృందంపై శ్రీకాంత్ సెటైర్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments