Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో కోడికి టిక్కెట్ తీయలేదని రూ. 500 ఫైన్? ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (17:59 IST)
ప్రభుత్వ వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవాల్సిందే. కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్‌కి వెళ్తున్నాడు.


అయితే కోడికి టిక్కెట్ తీయలేదని సదరు వ్యక్తికి కర్ణాటక ఆర్టీసీ రూ.500 ఫైన్ వేసింది. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. 
 
ఈ విషయం తెలియని ఆ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. కేవలం తనకు మాత్రం టిక్కెట్ తీసుకున్నాడు గానీ, కోళ్ల సంగతి చెప్పలేదు. అనుకోకుండా ఆర్టీసీ చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి వచ్చారు. 
 
ఆ వ్యక్తి తాను తీసుకున్న టిక్కెట్‌ను మాత్రమే చూపాడు, అయితే కోళ్ల సంగతి ఏమిటంటూ వారు ప్రశ్నించారు. దాంతో అతడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు ఫైన్ విధించారు. దాంతో ఆ వ్యక్తి ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments