Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడ్యూరప్ప నిజాయితీపరుడప్పా.. అవన్నీ తప్పుడు కేసులే : ప్రధాని మోడీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీఎస్. యడ్యూరప్పకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లీన్‌చిట్ ఇచ్చారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆ

Webdunia
సోమవారం, 7 మే 2018 (09:00 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీఎస్. యడ్యూరప్పకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లీన్‌చిట్ ఇచ్చారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆయనపై 23 కేసులు నమోదైవున్నాయి. వీటిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. యడ్యూరప్ప ఎంతో నిజాయితీపరుడని, ఆయనపై కాంగ్రెస్ నేతలు తప్పుడు అవినీతి కేసులు పెట్టారని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై రూ.5వేల కోట్ల అక్రమాల ఆరోపణలు లేవా? అంటూ నిలదీశారు.
 
ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆదివారం ఆయన రాయచూరు, జమఖండి, హుబ్లీలలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. "ఆ తల్లి, కొడుకు ప్రస్తుతం బెయిల్‌పై ఎందుకున్నారు? ఎందుకు కోర్టుకు హాజరు కావడం లేదు? వారిపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదైంది? వారు ఏ కేసులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు? కాంగ్రెస్‌ నాయకత్వం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి తీరాలి. మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌ తల్లీకొడుకులపై రూ.5000 కోట్ల ఆరోపణలున్నాయి. అధినేతలు బెయిల్‌పై ఉన్న పార్టీ ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తోందా?" అంటూ మోడీ దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments