Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో మహిళలు మాయమైపోతున్నారు... ఎందుకు?

కర్ణాటకలో మహిళలు మాయమవుతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న మహిళలు వ్యభిచారగృహాల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటక రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా... వ్యభిచార గృహాలకు విక్రయం... కిడ్నాప్‌ల పర

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (09:41 IST)
కర్ణాటకలో మహిళలు మాయమవుతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న మహిళలు వ్యభిచారగృహాల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటక రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా... వ్యభిచార గృహాలకు విక్రయం... కిడ్నాప్‌ల పర్వం అధికంగా సాగుతున్నట్టు తేలింది. 
 
దీనికి నిదర్శనం 2014 నుంచి 2017 మే నెల వరకు ఈ రాష్ట్రంలో 21,053 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆ రాష్ట్ర పోలీసు రికార్డులే వెల్లడించడం సంచలనం రేపింది. అదృశ్యమైన వారిలో 17,777 మంది మహిళలను వివిధ ప్రాంతాల్లో పోలీసులకు దొరికారు. 2014వ సంవత్సరంలో 5,989 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేసులు నమోదైనాయి. 2016వ సంవత్సరంలో అదృశ్యమైన మహిళల సంఖ్య 6,316కు పెరిగింది. 
 
కిడ్నాప్‌లకు గురవుతున్న మహిళలు ఎక్కువగా వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని సాక్షాత్తూ కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలోనే అంగీకరించారు. పేద మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి వారిని తీసుకెళ్లి వ్యభిచారవృత్తిలో దించుతున్నారని తేలింది. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినా మహిళల అదృశ్యానికి తెరపడటం లేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments