Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్‌కు అంతరాయం : ముఖ్యమంత్రికి రూ.10 వేల ఫైన్!!

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (17:01 IST)
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమేకాకుండా ఏకంగా రూ.10 వేల అపరాధం విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు నాటి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ప్రధాన కారకుడని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆ సమయంలో మంత్రి ఈశ్వరప్ప రాజీనామాకు వారు పట్టుబట్టారు. 
 
గత 2022లో జగిరిన ఈ ధర్నా సందర్భంగా సిద్ధరామయ్య, ప్రస్తుత రవాణా మంత్రి రామలింగారెడ్డి, పరిశ్రమల శాఖామంత్రి ఎంబీ పాటిల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలాలు ట్రాఫిక్‌‍కు అంతరాయం కలిగించారంటూ గతంలో కేసు నమోదైంది.
 
ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతపై అపరాధం విధించింది. అందులోనూ ప్రజాప్రతినిధులు అయ్యుడి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం ఎంతమాత్ం ఆమోదయోగ్యం కాదని కర్నాటక హైకోర్టు అభిప్రాయపడింది. పైగా, ఈ కేసును కొట్టివేయాలంటూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments