Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధాలపై నిలదీసిన భార్య.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. యడ్యూరప్ప హితవు

అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తన బలహీనత.. ఈ విషయంలో తనను ఏమాత్రం ప్రశ్నించవద్దని భార్యతో చెప్పిన ఓ కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బండారం బయటపడింది. అంతటితో ఆగకుండా భార్య ప్రశ్నించిన పాపానికి ఆమెపై చేజేసుకుని.. ఇ

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (16:39 IST)
అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తన బలహీనత.. ఈ విషయంలో తనను ఏమాత్రం ప్రశ్నించవద్దని భార్యతో చెప్పిన ఓ కర్ణాటక మాజీ ఎమ్మెల్యే బండారం బయటపడింది. అంతటితో ఆగకుండా భార్య ప్రశ్నించిన పాపానికి ఆమెపై చేజేసుకుని.. ఇంటి నుంచి బయటికి నెట్టేశాడు. ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ భార్య మాత్రం భర్త ఇంటి ముందే ధర్నాకు దిగారు. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని ముదిగెరె అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కుమారస్వామిని నీటిపారుదల శాఖలో ఇంజినీరుగా పనిచేస్తున్న సవిత పెళ్లాడారు. ఈ కుటుంబం హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. అయితే కుమార స్వామి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని ఎంత చెప్పినా వినట్లేదని సవిత ప్రశ్నించింది. 
 
అయినా భార్య సవిత భర్తను నిలదీయడంతో ఆమెను కొట్టి ఇంటినుంచి బయటకు నెట్టి... ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. కాగా తన భార్య సవిత తనకున్న 30 ఎకరాల కాఫీ తోటను తన పేరిట పెట్టాలని తనను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని కుమారస్వామి ఆరోపించారు. కాఫీ తోట ఇవ్వనన్నందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అప్రతిష్టపాలు చేస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. బీజేపీ ప్రతిష్ట మంటగలిసేలా కుటుంబవ్యవహారంలో ప్రవర్తించవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కుమారస్వామికి హితవు పలికారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments