Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య స్కూల్‌లో కరోనా కలకలం.. 60 మంది విద్యార్థులకు పాజిటివ్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (13:29 IST)
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ స్కూల్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో స్కూల్‌ను వచ్చేనెల 20 వరకు మూసివేశారు.
 
ఆదివారం సాయంత్రం శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన ఓ విద్యార్థి వామ్‌టింగ్ చేసుకున్నట్లు, డయేరియాతో ఇబ్బందిపడుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ తెలిపారు. వెంటనే తారు ఆ క్యాంపస్‌లో ఉన్న మొత్తం 480 మందికి పరీక్షలు నిర్వహించామని, అందులో 60 మందికి కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు.
 
అయితే పాజిటివ్‌గా తేలిన వారిలో ఇద్దరిలోనే లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరో వారం రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వైరస్ సోకినవారిలో 46 మంది కర్ణాటకు చెందినవారుకాగా, మిగిలిన 14 మంది తమిళనాడుకు చెందినవారని తెలిపారు. శ్రీచైతన్య రెసిడెన్సియల్ స్కూల్‌ను నెలరోజుల క్రితమే పునఃప్రారంభించారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments