Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు దారుణమన్న కంగనా రనౌత్: ముందునుంచి ఆయనంతేనన్న శివసేన!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనను తాను అత్యాచారానికి గురైన మహిళతో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలను సెలెబ్రిటీలు తప్పుబడుతున్నారు. ఓ వైపు మహిళా సంఘాలు సల్మాన్ వ్యాఖ్యలను ఖండిస్తుంటే సల్మాన్ ఖాన్ 'రేప్

Webdunia
గురువారం, 23 జూన్ 2016 (12:42 IST)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనను తాను అత్యాచారానికి గురైన మహిళతో పోల్చుకుంటూ చేసిన వ్యాఖ్యలను సెలెబ్రిటీలు తప్పుబడుతున్నారు. ఓ వైపు మహిళా సంఘాలు సల్మాన్ వ్యాఖ్యలను ఖండిస్తుంటే సల్మాన్ ఖాన్ 'రేప్' వ్యాఖ్యలు' తనను బాధించాయని బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ వెల్లడించింది. అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అలాగే ఇలాంటి విషయాల్లో పరస్పరం నిందించుకోవడం సబబు కాదని వెల్లడించింది. 
 
ఎదుటివారి కంటే తామే గొప్ప అని చెప్పుకోవడం సరికాదని కంగనా రనౌత్ తెలిపారు. 'కృతి' షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కంగనా రనౌత్ మాట్లాడుతూ... సల్మాన్ ఖాన్‌పై మండిపడ్డారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలతో సమాజానికి తలవంపేనని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలపై సమాజానికి సల్మాన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేసింది. 
 
ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై శివసేన కూడా బుధవారం మండిపడింది. ఇంకా సల్మాన్ క్షమాపణలు చెప్పేంతవరకు దర్శకులు ఆయనతో సినిమాలు చేయకుండా బహిష్కరించాలని డిమాండ్ చేసింది. సల్మాన్ ఖాన్ లాంటి సెలెబ్రిటీని ఇంతవరకు చూసింది లేదని.. ముందునుంచే వినాశకర వ్యక్తిత్వాన్ని సల్మాన్ కలిగివున్నాడని శివసేన ఫైర్ అయ్యింది. జంతువులను కాల్చేయడం.. ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారిపై కారును ఎక్కించడం వంటివి చేస్తున్న అతనిని ప్రజలింకా హీరోగా చూడటం దారుణమని శివసేన అధికార ప్రతినిధి మనీషా కయాండే మీడియాతో తెలిపారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments