Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్‌కు 6 నెలల జైలు శిక్ష... సుప్రీంకోర్టు తీర్పు

కోర్టు ధిక్కరణ కేసు కింద కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టీస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలల జైలుశిక్షను విధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (11:41 IST)
కోర్టు ధిక్కరణ కేసు కింద కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టీస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలల జైలుశిక్షను విధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. జస్టిస్ కర్ణన్‌ను జైలుకు పంపకపోతే కోర్టు ధిక్కారానికి పాల్పడిన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు క్షమించిందనే కళంకం వస్తుందని పేర్కొంది.
 
ఇదిలావుండగా సోమవారం జస్టిస్ కర్ణన్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌కు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులోని మరో ఏడుగురు న్యాయమూర్తులకూ అదే శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లోగా ఢిల్లీలోని ‘నేషనల్‌ కమిషన్‌, షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కాన్‌స్టిట్యూషనల్‌ బాడీ’కి ఆ జరిమానా చెల్లించకపోతే మరో ఆరునెలలు ఖైదులో ఉండాల్సిందేనని జస్టిస్ కర్ణన్ ప్రకటించారు.
 
ఈ నేపథ్యంలో జస్టీస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కరణ కేసు కింద ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జస్టీస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం ధర్మాసనం నిర్ధారించింది. కోర్టు ధిక్కారానికి శిక్ష విధించే అధికారం... ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి న్యాయమూర్తా? సామాన్యుడా? అని చూడదని పేర్కొంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అదనపు సొలిసిటర్ జనరల్ మహీందర్ సింగ్, సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ ఏకీభవించారు. జస్టిస్ కర్ణన్‌ను శిక్షించవలసిన అవసరం ఉందన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments