Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో సైకో కిల్లర్ అమిత్ అని సెర్చ్ చేయండి... డోంట్ వేస్ట్ యువర్ టైం పోలీస్... సైకో కిల్లర్

హత్యలు చేసిన వారిని పోలీసులు పట్టుకుంటే ఏం చెపుతారు...? తప్పించుకునేందుకు ఎన్నెన్నో కారణాలు చెపుతారు. అసలు నేను కాదని కూడా బుకాయిస్తారు. కానీ బ్యాంకు దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కిన ఓ యువకుడు పోలీసులకు చెప్పిన వివరాలతో వారికి షాక్ ఇచ్చినంత పనైంది. బ

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (20:18 IST)
హత్యలు చేసిన వారిని పోలీసులు పట్టుకుంటే ఏం చెపుతారు...? తప్పించుకునేందుకు ఎన్నెన్నో కారణాలు చెపుతారు. అసలు నేను కాదని కూడా బుకాయిస్తారు. కానీ బ్యాంకు దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కిన ఓ యువకుడు పోలీసులకు చెప్పిన వివరాలతో వారికి షాక్ ఇచ్చినంత పనైంది. బీహారు లోని వైశాలి జిల్లాలో అతడు బ్యాంకు దొంగతనానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని విచారించడం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా అతడు వారితో ఇలా అన్నాడు. 
 
ఇంటరాగేషన్ పేరుతో మీ టైంను వేస్ట్ చేసుకోవద్దు. గూగుల్ సెర్చ్‌లో సైకో కిల్లర్ అమిత్ అని కొట్టండి. నా గురించి మొత్తం సమాచారం వచ్చేస్తుందంటూ చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. తాము ఎంతో కాలంగా వెతుకుతున్న సైకో కిల్లర్ అతడే అని తెలియడంతో షాక్ తిన్నారు. వైశాలి - పాట్నాలతో పాటు ఇతర జిల్లాల్లో ఇతడు 22 హత్యలు చేసినట్లు రికార్డుల్లో ఉన్నాయి. ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ లలాన్ శ్రీవాస్తవ కుమారుడయిన ఇతడి పేరు అవినాష్ శ్రీవాస్తవ అలియాస్ అమిత్. 
 
2003లో అతడి తండ్రి హత్యకు గురయ్యాడు. ఇక అప్పట్నుంచి తన తండ్రిని హత్య చేసినవారిని పథకం ప్రకారం మట్టుబెడుతూ వచ్చాడు. అలా సైకో కిల్లర్‌గా మారిపోయాడు. ఇతడు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంసీఏ చదివాడు. పలు అగ్రశేణి ఐటీ సంస్థల్లో ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఐతే తన తండ్రిని హత్య చేయడంతో ఆ బాధతో అతడు సైకో కిల్లర్‌గా మారినట్లు తెలుస్తోంది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments