Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా : గ్యాంగ్‌రేప్ కేసులో ఇరుక్కున్న జర్నలిస్టు

హర్యానా రాష్ట్రంలో జాట్ల ఆందోళన సమయంలో జరిగిన సామూహిక అత్యాచారాల కేసులో సంబంధం ఉన్న ఓ జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాష్ట్రంలోని ముర్తాల్‌లో జాట్ల తెగకు చెందిన వారు ఆందోళనకు దిగిన విషయం తెల్

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (12:06 IST)
హర్యానా రాష్ట్రంలో జాట్ల ఆందోళన సమయంలో జరిగిన సామూహిక అత్యాచారాల కేసులో సంబంధం ఉన్న ఓ జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాష్ట్రంలోని ముర్తాల్‌లో జాట్ల తెగకు చెందిన వారు ఆందోళనకు దిగిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తారిక్ అన్వర్ అనే ఈ జర్నలిస్టు ఈ కేసుకు సంబంధించి తప్పుడు నివేదిక సమర్పించినట్టు ఎమికస్ క్యురీగా ఉన్న అడ్వొకేట్ అనుపమ్ గుప్తా పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారు. 
 
అతడిని ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. ఓ ఆడియో రికార్డింగ్‌లో ఓ యువతీ గొంతు బాధితురాలిదేనని అన్వర్ తప్పుడు సాక్ష్యాధారాలతో నివేదిక సమర్పించాడని.. అసలు ఆ గొంతు మరో మహిళదని, ఆ తర్వాత వాయిస్ శ్యాంపిల్స్ టెస్ట్‌లో తేలిందని అనుపమ్ గుప్తా అన్నారు. తప్పుడు ఎవిడెన్స్ ఇచ్చిన అన్వర్‌ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనన్నారు.
 
ముర్తాల్‌లో జాట్లు తమ అందోళన తీవ్రతరం చేసినప్పుడు కొంతమంది మహిళలను దగ్గరలోని పొలాల్లోకి తీసుకుపోయి అత్యాచారం చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఫస్ట్ పోస్ట్ జర్నలిస్ట్ అయిన తారిక్ అన్వర్.. ఫేక్ గ్యాంగ్‌రేప్ స్టోరీని సృష్టించి, జర్నలిజం వృత్తికి మచ్చతెచ్చాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెల్సిందే. ఈ కేసు ఇపుడు ఆయన మెడకు చుట్టుకుంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments