Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేత అవధేష్ కుమారులు అంత పనిచేశారా? ఎయిర్‌ హోస్టెస్‌పై?

బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే

Webdunia
ఆదివారం, 20 మే 2018 (13:47 IST)
బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్‌లో బాధితురాలు పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులు పట్నాలో ఉంటారు. 
 
తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసి వెళ్లేందుకు ఆమె పట్నాకు వచ్చింది. అవధేష్ కుమారుడు సుషాంత్ రంజన్‌కు ఎయిర్ హోస్టెస్‌కు ముందే పరిచయం వుంది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ పరిచయంతో డిన్నర్‌కు ఆహ్వానించాడు సుశాంత్. వారు చెప్పిన చోటకు ఆమె వెళ్లింది. అక్కడే సుశాంత్ సోదరుడు ప్రశాంత్ కూడా ఉన్నాడు.
 
ఇద్దరూ కలిసి ఆమెను బంధించి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తండ్రికి చెందిన గెస్ట్ హౌస్‌లో ఆమెను బంధించి, వెళ్లిపోగా, అక్కడి ఉద్యోగుల సాయంతో బయటపడ్డ ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత కేసు నమోదు చేసుకునేందుకు వెనుకాడిన పోలీసులు, ఆపై 24 గంటల తరువాత కేసు పెట్టి దర్యాఫ్తు ప్రారంభించారు. కానీ అవధేష్ మాత్రం బాధితురాలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం